Tenth Class Public Exams Cancelled in Telangana | తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.మే 17 నుంచి రాష్ట్రంలో మొదలయ్యే పదవ పరీక్షలను కోవిడ్ విజృంభిస్తున్న కారణంగా రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ CBSE తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్కులను ఎలా కేటాయిస్తారన్న దానిపై త్వరలో SSC బోర్డు విధి విధానాలను రూపొందిస్తుంది. అప్పుడు ఎవరికైనా విద్యార్థులకు తమ మార్కులు నచ్చకపోతే... ఎగ్జామ్ రాసుకోడానికి అర్హత కల్పిస్తామన్నారు విద్యాశాఖాధికారులు.
SSC పరీక్షలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉదయం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఓ నివేదికను CMO కు సమర్పించిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
0 Comments