తెలంగాణలో 'పది' ఫలితాలు విడుదల
‣ ఫార్మేటివ్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మే 21న విడుదల చేశారు. ఫలితాలను కింద తెలిపిన వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈసారి ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో 5,21,393 మంది పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల.. చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్ వచ్చిందో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
0 Comments