Ad Code

Ticker

6/recent/ticker-posts

పాఠశాలలకు పాఠ్యపుస్తకాల అందజేత

పాఠశాలలకు పాఠ్యపుస్తకాల అందజేత

రాయికోడ్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేస్తున్న ఎంఈవో శ్రీనివాస్


రాయికోడ్ మండలం లోని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కలిపి 47 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఎంఈవో శ్రీనివాస్ సోమవారం పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రం లోని ఎమ్మార్సీ కార్యాలయం లో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు 47 పాఠశాలలకు గాను మొత్తం 12,383 బుక్స్ అందజేశామన్నారు. 1వ తరగతి నుండి 8 వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియం బుక్స్, 9వ, 10వ తరగతులకు తెలుగు మీడియం పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠ్యంశాలను చక్కగా అర్థం చేసుకొని వాటి తాత్పర్యాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరును తీసుకరావాలని సూచించారు.

Post a Comment

0 Comments

ZPHS SINGITHAM

Ad Code