తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు జరుపుకుంటున్న విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయికోడ్ మండల్ సింగీతం గ్రామంలో
ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాదినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను సింగీతం గ్రామ ఎంపీటీసీ నిరంజన్ గారు విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో సింగీతం గ్రామ ఉప సర్పంచ్ రేణుక శివరాజ్, ఉర్దూ మీడియం SMC ఛైర్మెన్ మరఫ్ అలీ, ex SMC చైర్మన్ రవీందర్, ప్రధానోపాధ్యాయులు రఘునాథ్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారు, రాజ్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, A. నర్సింలు గారు, N.నర్సింలు గారు, యాదయ్య గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
#ZphsSingitham
0 Comments