Ad Code

Ticker

6/recent/ticker-posts

హాజరు మాసోత్సవం - ఆగస్ట్ 2019 శతశాతం హాజరు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేత.

హాజరు మాసోత్సవం - ఆగస్ట్ 2019 
శతశాతం హాజరు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేత.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగీతంలో హాజరు మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆగస్ట్ మాసంలో వందశాతం హాజరు నమోదు చేసుకున్న విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి.రఫత్ సుల్తానా గారు బహుమతులు అందజేశారు. ఇంకా మిగతా విద్యార్థులు కూడా ఇలాగే వందశాతం హాజరు కావాలని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


మాసోత్సవ ముఖ్యోద్దేశం
పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కాకపోతే పిల్లలు ఏ విధంగా నష్టపోయి తమ ఉజ్వల భవిష్యత్తును ఏ విధంగా కోల్పోనున్నాడనేది తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించనున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేలా పాఠశాల యాజమాన్య కమిటీ, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు. క్రమం తప్పకుండా వచ్చే విద్యార్థులను పాఠశాలల్లో ప్రార్థనా సమావేశాలు, లేదా వివిధ ప్రత్యేక కార్యక్రమాల్లో బహుమతులు అందజేసి అభినందించనున్నారు. దీంతో తరచూ గైర్హాజయ్యే విద్యార్థుల్లో రెగ్యులర్‌గా రావాలన్న ఆలోచనకు ప్రేరణ కలుగుతుందని నమ్మకం.
#ZphsSingitham

ZPHS SINGITHAM

Ad Code